జనసేనానికి ఇది పెద్ద దెబ్బే కదా పవన్ జీ..!
ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలతో విజయవాడ అంతటా ఆగమాగమైంది.. కొన్ని వేల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా ఆరున్నర వేల కోట్ల నష్టం వాటిల్లిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాట. అయితే ఆ వారం పది రోజులు చంద్రబాబు విజయవాడలోనే ఉండి బాధితులతో ఉన్న కానీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల పరామర్శకు రాకపోవడం…
వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడను సందర్శించడానికి.. బాధితులను పరామర్శించడానికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని వైసీపీ శ్రేణులు ప్రశ్నించిన సంగతి తెల్సిందే. నెటిజన్లు, న్యూట్రల్ పీపుల్స్ సైతం పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే బాగుండేది అని సూచనలు సలహాలు కూడా చేశారు.
అయితే విజయవాడకు రాకపోవడం వెనక ఉన్న కారణం గురించి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” నేను వెళ్తే బాధితులకు సాయం చేయడానికి ఇబ్బంది అవుతుంది.. క్లౌడ్ ఎక్కువ వస్తే సహాయ కార్యక్రమాలకు అటంకం ఏర్పడుతుంది. అసలే బురద .. జారి ప్రమాదం ఏదైన జరిగితే పవన్ కళ్యాణ్ వచ్చాడు.. జనం తాకిడికి తోపులాట జరిగి చనిపోయారు అనే మాట రావోద్దు అని రాలేదు.. అయిన సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను ఎందుకు అని రాలేదు అని వివరణ ఇచ్చారు.
అయితే ఇది చెప్పిన తర్వాత తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గొట్టిప్రోలులో ఏలేరు జలాల ముంపుకు గురైన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు..ఈ పర్యటన సందర్భంగా ప్రజలు కానీ బాధితులు కానీ మూకుమ్మడిగా వచ్చి పవన్ మీద పడలేదు. పవన్ కళ్యాణ్ వచ్చారా.. బాధితులతో మాట్లాడారా అని అన్నట్లు ఉంది తప్పా పవన్ ముందుగా చెప్పినట్లు పరిస్థితులు ఏమి అక్కడ చోటు చేసుకోలేదు..
విజయవాడలో చంద్రబాబు పర్యటించినప్పుడు నెలకొన్న వాతావరణమే పిఠాపురం గొట్టిప్రోలులో చోటు చేసుకుంది తప్పా అంతకుమించి ఏమి జరగలేదు. మరి విజయవాడ పోతన్న అప్పుడు వద్దన్న అధికారులు పిఠాపురం పోతానంటే వద్దనలేదా పవన్ అని నెటిజన్లు, న్యూట్రల్ పీపుల్స్ తో పాటు వైసీపీ శ్రేణులు చేస్తోన్న వాదన. వరదలతో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కూటమి ప్రభుత్వం పవన్ రాకపోవడంతో అది ఇంకా మూట కట్టుకున్నట్లు అయింది.
పవన్ పొలిటికల్ కేరీర్ లో ఇది పెద్ద మాయని మచ్చగా ఉంటుంది. తెలుగులో ఓ సామెత ఉంటది మనల్ని నమ్ముకున్నవాళ్లు ఆనందంగా ఉన్న సమయంలో పలకరించకపోయిన పెద్ద పట్టింపు ఉండదు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత కష్టమైన వెళ్లి నేను ఉన్నాననే భరోసానివ్వాలి అని.. మరి విజయవాడ చరిత్రలోనే కాదు.. ఏపీ చరిత్రలోనే ఎప్పుడు రానీ వరదలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలను పలకరించడానికి సైతం పోనీ పవన్ తీరుతో జనసేన కు రాజకీయంలో పెద్ద దెబ్బే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.