ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ
ప్రపంచంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీతో బాధపడుతున్నట్లు తాజాగా జరిపిన సర్వేల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
ఇది బయటకు కనిపించకుండా గుండె, మెదడు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని పేర్కొంది. బీపీ కంట్రోల్లో ఉండాలంటే స్మోకింగ్ మానేయాలి..
రోజు తినే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడం, నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలని సూచించింది.