తెలంగాణలో మరోసారి కులగణన సర్వే..!

Once again caste census survey in Telangana..!
తెలంగాణ ప్రభుత్వం కులగణనపై కీలక నిర్ణయంపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” కులగణనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి.
ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఈనెల పదహారు తారీఖు నుండి మరోసారి కులగణనపై రీసర్వే నిర్వహించాలని నిర్ణయించాము.
కులగణనలో పాల్గోనని వారికోసం ఈ అవకాశం కల్పిస్తున్నాము. దాదాపు 3.1% మాత్రమే కులగణనలో పాల్గోనలేదు అని తెలిపారు.
