పాత సంజయ్ గుర్తుకొచ్చారు
కేంద్ర హోం శాఖ సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మళ్లీ పాత సంజయ్ ను గుర్తుకు తెచ్చారు. నిన్న శనివారం ఆశోక్ నగర్ లో గ్రూప్ – 1 అభ్యర్థుల ఆందోళనకు మద్ధతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గోన్నారు. అంతకుముందు గ్రూప్ – 1 అభ్యర్థులతో భేటీ అయ్యారు. అనంతరం అభ్యర్థులతో కల్సి ధర్నాకు దిగారు.
అక్కడ నుండి సచివాలయం దగ్గరకెళ్లారు. అక్కడ ఆందోళనకు దిగారు. అభ్యర్థులతో కల్సి సచివాలయం లోపలకెళ్లడానికి ప్రయత్నించారు. అరెస్టు అయి పోలీస్ స్టేషన్ కెళ్లారు. ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని.. జీవో29 ను రద్ధు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడోద్దని హితవు పలికారు.
అప్పట్లో బీఆర్ఎస్ పాలనలో బీజేపీ అధ్యక్షుడిగా ప్రతి అంశంపై రోడ్లపైకి వచ్చి ధర్నాలకు.. ఆందోళనలకు దిగేవారు బండి సంజయ్. చాలా రోజుల తర్వాత ఎన్నికల సమయంలో తప్పా ఎప్పుడూ రోడ్లపైకి రానీ సంజయ్ తాజాగా రావడం బండి సంజయ్ తనలోని పాత సంజయ్ ను గుర్తుకు తెచ్చారని కమలం నేతలు.. కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్ తో సహా బీజేపీ అగ్రనేతలంతా ఇదే విధంగా రోడ్లపైకి ప్రజలకు మద్ధతుగా సమస్యలపై పోరాడితే రానున్న రోజుల్లో అధికార దిశగా వెళ్లడం ఖాయమంటున్నారు కమలం శ్రేణులు.