మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ వీడియో కాల్..!

 మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ వీడియో కాల్..!

Loading

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల దాడులు రోజు రోజుకి దాడులు శృతిమించి పోతున్నాయి. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ప్రమాదాలు అనేక మార్గాలలో ప్రచారం చేస్తున్నప్పటికీ ఏదో మార్గంలో సైబర్ నేరగాళ్లు తమ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇలా సైబర్ నేరగాళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సంగతి మనకు తెల్సిందే.

తాజాగా న్యూడ్ వీడియో కు సంబంధించిన వీడియో ఒకటి సాక్షాత్తు నల్గొండజిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు వీరేశంకి న్యూడ్ కాల్స్ తో సైబర్ నేరగాళ్లు అటాక్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడి యా అకౌంట్లో నుండి ఫోటోలను సేకరించి తద్వారా స్క్రీన్ రికార్డు పర్సనల్ వాట్సాప్ నెంబర్ కి పంపి బెదిరించారు .

వీడియో కాల్ చేస్తున్నారని వెంటనే పసిగట్టిన వేములవీరేశం అప్ప టికప్పుడు అలర్ట్ అయ్యారు. వాట్సప్ చాటింగ్ ద్వారా ఎమ్మెల్యేకి బెద రింపు మెసేజ్లు పంపిన సైబర్ నేరగాళ్లు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా..? లేదంటే డబ్బులు పంపిస్తావా అంటూ బ్లాక్ మెయిలింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సల హాతో ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ నేరగాళ్ల నెంబర్ బ్లాక్ చేశాడు. .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *