మోహాన్ బాబుకు మరోకసారి నోటీసులు..!
ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో జర్నలిస్ట్ పై జరిగిన దాడి ఘటనలో ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు.. హీరో… నిర్మాత మంచు మోహాన్ బాబుకు మరోకసారి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికి మోహాన్ బాబు అజ్ఞాతం వీడలేదు. అది కాకుండా ముందస్తు బెయిల్ పై మోహన్ బాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కొట్టివేసింది.
మరోవైపు అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చిన గడవు కూడా నిన్న మంగళవారం తో ముగిసింది. దీంతో నేడు ఆయన పోలీసుల ముందర విచారణకు హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే మోహాన్ బాబుకు నోటీసులు వెళ్లనున్నట్లు సమాచారం.