అభివృద్ధి లేదు.. సబ్జెక్టు అంతకన్నా లేదు…!

Minister Seethakka
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు.
గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కనీసం జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మంత్రి సీతక్క అన్నారు.
నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు కేంద్ర మంత్రిగా ఉండి మరి బండి సంజయ్ పాల్ప డుతున్నారని ఆరోపించారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంత కన్నా లేదని అన్నారు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదని ఆమె అన్నారు.
