ఇద్దరు బిడ్డల తల్లిగా నివేదా థామస్

Nivetha Thomas
నివేదా థామస్ కథాబలమున్న పాత్రలకు.. నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు .. వైవిధ్యభరితమైన మూవీలకు కేరాఫ్ అడ్రస్ . నిన్ను కోరి అయిన బ్రోచేవారెవరూ అయిన వకీల్ సాబ్ అయిన చిత్రం ఏదైన కానీ తనకంటూ ఓ మార్కు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్. అలాంటి నివేదా థామస్ ఇద్దరు బిడ్డల తల్లిగా నటిస్తుంది అంటే షాక్ అవ్వాల్సిన విషయమే కదా…
అసలు విషయానికి వస్తే నంద కిశోర్ ఇమాని తెరకెక్కిస్తోన్న .. రానా నిర్మిస్తున్న తాజా చిత్రం 35-చిన్న కథ కాదు. ఈ చిత్రంలో నివేదా తల్లి పాత్ర పోషిస్తుంది.. ఈ నెల ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రం గురించి ముద్దుగుమ్మ మాట్లాడూతూ ఇది చాలా సింపుల్ గా ఉండే అందమైన కథ.. ఇందులో నేను సరస్వతి పాత్రలో గృహిణిగా కన్పిస్తాను.. ఈ చిత్రం గురించి ఎలా ఉంటుంది.. ఏంటనేది మూవీ తప్పకుండా చూడాల్సిందే.. ఈ చిత్రం ను చూస్తున్నంత సేపు నివేదా థామస్ కన్పించదు సరస్వతి కన్పించదు అని అన్నారు.
ఇద్దరు బిడ్డల తల్లిగా నటిస్తున్నారు కేరీర్ ఏమి రిస్క్ అవ్వదా అని అంటే మన దేశంలో ఇరవై ఏండ్లు దాటిన ఏ అమ్మాయి కైన తరచూ ఎదురై తొలి ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే .. అలాంటిది ఇప్పుడు నేను తల్లి పాత్ర పోషిస్తే తప్పు ఏముంది. నిజానికి దీని ప్రభావం నా తర్వాతి చిత్రాలపై పడుతుందని నేను ఆలోచించాను.. కానీ ప్రేక్షకులకు దర్శకులకు నేను అన్ని రకాల పాత్రలను పోషిస్తాను అని తెలియాలి కదా..ఈ మూవీ చూశాక తల్లి పాత్రలకే నివేదా సరిపోతుందని రాయకపోతే మంచిదంటూ నవ్వుతూ చెప్పింది.