లార్డ్స్ మైదానంలో మెరిసిన నితీష్ కుమార్ ..!

Nitish Kumar Reddy
ఇంగ్లాండ్ జట్టుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు టీమిండియా ఆటగాడు, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23)ను అవుట్ చేయగా , అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ(18)ని నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు.
అయితే ఈ ఇద్దరూ ఓపెనర్లు కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇవ్వడం విశేషం. రెండు వికెట్లను పడగొట్టిన నితీశ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు.మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ ఇరవై ఐదు ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయి ఎనబై మూడు పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో ఓలి పోప్ (12), జోరూట్ (24) ఉన్నారు.. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది, ఆకాశ్ దీప్ ఏడు, మహమ్మద్ సిరాజ్ ఐదు ఓవర్లు వేశారు.మంచి దూకుడుని ప్రదర్శిస్తోన్న రూట్ ను కట్టడీ చేయాల్సినవసరం టీమిండియాకు ఉంది.