చరిత్రకెక్కనున్న నిర్మలా సీతారామన్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ చరిత్రకెక్కనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు.
దీని ద్వారా మాజీ ఆర్థిక శాఖమంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ తిరగరాస్తారు.
వీరిద్దరూ ఐదు పూర్తి స్థాయి, ఒకటి మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. మరోవైపు ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.