నిలోఫర్ ఆసుపత్రిలో అతనిదే రాజ్యం..!

 నిలోఫర్ ఆసుపత్రిలో అతనిదే రాజ్యం..!

Niloufer Hospital

Loading

ఆయనో ఫోర్త్ క్లాస్ ఉద్యోగి. అయితేనేమి ఓ సీఎం.. ఓ మంత్రి.. ఓ సూపరిడెంట్ కున్న పవర్ ఆయనకుంది. ఆయన ఏమి చెప్పినా సార్ వింటాడు. ఆయన మాటే ఆ సారూకి వేదం .. ఆయన చెబితే నిర్ణయాలు, ఆదేశాలు వచ్చినట్టే. ఆ సార్ ఉన్నంత కాలం నిలోఫర్ ఎవరిదీ నడవదు.” అంటూ ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఇప్పుడు హల్ చల్ చేస్తున్నా రని స్వయంగా ఉద్యోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నిలోఫర్లో తానే షాడో సూ పరింటెండెంట్ అనే తరహాలో వ్యవహరిస్తుం టాడని ఉద్యోగులు చెబుతున్నారు. సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం, సెక్యూరిటీ గార్డులకు హుకుం జారీ చేయడం, డ్యూటీ ఆర్ఎంవో లు. డాక్టర్లకు ఫోన్లు చేసి ట్రీట్మెంటై పై సల హాలివ్వడం వంటివన్నీ ఫోర్డ్ క్లాస్ ఉద్యోగి చేస్తున్నారట.

సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్కు అత్యంత సన్నిహితుడిగా సదరు ఉద్యోగి వ్యవహరిస్తుండటంతో ఆర్ఎంవో లు, డాక్టర్లు కూడా ఆయన్ను ఏమీ చేయలేని పరిస్థితి. ఇక పీజీ డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సపోర్టెడ్ స్టాఫ్ను, అయితే ఏకంగా బెదిరింపులకు దిగుతాడనే ప్రచారం కూడా ఉన్నది. గత ప్రభుత్వంలోనూ అవ్యక్తిపై ఆసుపత్రి అధికారులకు అనేక సార్లు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలే దు. ఇప్పుడిక ఆయనకు అత్యంత సన్నిహిత వ్యక్తి సూపరింటెండెంట్ సీలో కూర్చోవడం తో సదరు ఉద్యోగి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. సూపరింటెండెంట్కు చెప్పినా న్యాయం జరగదని ఉద్యోగులు మనోవేదనకు గురువుతున్నారు.

ఇవన్నీ సూపరింటెండెంట్ కితెలిసే జరుగుతున్నాయని కొందరు డాక్టర్లు ఆఫ్ రికార్డులో చెబుతున్నారు. అసలు నూ పరింటెండెంట్ ఆయనకు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఈ ఫోర్డ్ క్లాస్ ఉద్యోగి చేస్తున్న తప్పుడు పనుల్లో సూపరింటెండెంట్ పాత్ర ఉన్నదా? అన్నీ తెలిసినా యాక్షన్ తీసుకో కపోవడానికి కారణాలు ఏమిటీ? అనిసీనియర్ డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. గతంలో సదరు వ్యక్తి మాజీ గవర్నర్ తమిళి పై పై వ్యంగ్యంగా గ్రూప్లో పోస్టు చేశారు. దీంతో అప్పటి డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత కొందరు పెద్ద నాయకులు, యూనియన్ లీడర్లు, ఇప్పుడున్న సూపరింటెం డెంట్ సహకారంతో ఆ ఇష్యూను పక్కదారి పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నవి.

నియామకాల్లోనూ కీలకమే..? నిలోఫర్లోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ ఆ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఇన్నాల్వ్ అవుతారని ఆరోపణలున్నాయి. నిలోఫర్లో ఓటీమ్ ఏర్పడి ఉద్యోగాలు పెట్టించేందుకు డబ్బులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ స్టాఫ్ నర్సుకు ఉద్యోగం పెట్టించేందుకు డబ్బులు వసూల్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగం పెట్టించేందుకు ఒప్పందాలు జరిగినట్లు తెలిసింది. ఆమె నియామక ఆర్థర్ కూడా రెడీ అయింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ నుంచి సూప రింటెండెంట్ వరకు సంతకాలు అయ్యాయి.

కానీ ఎన్ హెచ్ఎం ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోన డంతో ఆమె నియామకం హోల్లో పడింది. దీంతో సదరు స్టాఫ్ నర్సు తన డబ్బులు తనకు ఇవ్వాలని సదరు ఉద్యోగి పై ప్రెజర్ పెట్టినట్లు సమాచారం. ఇవన్నీ బయటకు పొక్కకుండా ఈ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నది ఇక పేషెంట్ కేర్, సెక్యూరిటీల వద్ద కొంతడబ్బులు తీసుకొని వాళ్లకు నచ్చిన వార్డుల్లో డ్యూటీలు కూడా ఈ ఉద్యోగే వేయిస్తారట. పైగా పేషెంట్ అటెండర్ల దగ్గరడబ్బులు వసూల్ చేసే ప్రక్రియ లోనూ ఈ ఉద్యోగి కీలక పాత్ర వహిస్తారని ఓ డాక్టర్ చెప్పారు. ఆయన వ్యవహార శైలిని చూసి అక్కడ పనిచేసే ఆర్ఎంవోలే షాక్కు గురవు తున్న పరిస్థితి దీనిపై హెల్త్ మినిస్టర్ వెంటనే చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని దాక్టర్లు కోరుతున్నారు. ఎందుకంత ప్రయారిటీ? అంటే

కారుణ్య నియామకంలో వార్డు బాయ్ గా వచ్చి, ఆ తర్వాత డ్రైవర్. ఇప్పుడు ఎంఆర్డి స్టార్గా చెప్పుకోంటూ, నిత్యం సూపరింటెం మెంట్ చాంబర్ లోనే పనిచేస్తున్న ఈ ఉద్యోగి హడావిడి మాములుగా ఉండడు. ఇప్పటికీ ఆయన అధికారిక ఉత్తర్వుల్లో డ్రైవర్ గానే ఉన్నప్పటికీ, సూపరింటెండెంట్ చాంబర్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తాడు. ప్రస్తుత సూపరింటెండెంట్ కూడా ఆయనకు అదే తరహాలో ప్రయారిటీ ఇవ్వడం గమనార్హం.. ఇక నిలోఫర్ సూపరింటెండెంట్ ఆసుపత్రికి వస్తున్న సమయంలో మంత్రి తరహాలో సదరు ఉద్యోగి ఆధ్వర్యంలోనే హడావిడి జరుగుతున్న . సెక్యూరిటీ గార్డులంతా ఆయన వస్తున్న, వెళ్తున్నా కమాండోల తరహాలో పనిచేస్తుం టారు. పైగా ఆయన నిలబడి ఉన్న చోట నుంచి వంద మీటర్ల పరిధిలో రౌండప్ చేస్తారు. ఇదంతా సదరు ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఆదేశాలతో నే నిర్వహిస్తుంటారని ఓఆర్ఎంవో చెప్పారు. చిన్నపిల్లల వైద్యానికి ఫేమస్ గా నిలుస్తున్న ఈ సర్కారు దవాఖానలో ఇలాంటి శక్తులు. వ్యక్తులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ఓ మహిళా డాక్టర్ చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *