జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
🔹అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
- 150ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు
- ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS
- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS
- ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు
- భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం
- ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్
- 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు
- ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్
- ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాలి
- 3 నుంచి 7ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు
- 24 గంటల్లోనే FIR నమోదు చేయాలి
- 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి
- అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి
- ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి
- పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం
- మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష
- చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం
- మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి
- బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి
- మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి
- అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు
- పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు
- క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం CCTNS
- దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు అనుసంధానం
- డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం
- ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన
- అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి
- బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు
- ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ
- మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం
- దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ
- గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం
- బాధితులకు, నిందుతులకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఫ్రీ
- పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్