మేనేజర్ కి నో!.దర్శకుడుకి ఏకంగా కిస్ ! -నిత్యా మీనన్ పై నెటిజన్లు అగ్రహాం.!
ప్రముఖ సీనియర్ హీరోయిన్ ..నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యా మీనన్ పాల్గోన్నారు..
ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన నిత్య ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం నిరాకరించారు.
కానీ అదే వేడుకలో ఆమె ఏకంగా దర్శకుడు మిష్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని సైతం హగ్ చేసుకున్నారు. దీంతో వ్యక్తుల స్థాయిని బట్టి నటి ప్రవర్తిస్తున్నారు.. ఇది సరైనది కాదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహిస్తున్నారు.