హరీస్ కు నెట్ ఫ్లిక్స్ ఆర్థిక సాయం
అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో బరిలో ఉన్న కమలా హరీస్ కు నెట్ ఫ్లిక్స్ అండగా నిలిచింది. ఏకంగా నెట్ ఫ్లిక్స్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హెస్టింగ్స్ భారీ విరాళం ప్రకటించాడు. అయన దాదాపు రూ. 58.6కోట్లు(7మిలియన్లు )ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి..
ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటివరకు హేస్టింగ్స్ ఇచ్చిన అతిపెద్ద మొత్తం విరాళం ఇదే కావడం గమనార్హం.. నిరాశకు గురి చేసిన బైడెన్ డెబిట్ తర్వాత మేము మళ్ళీ గేమ్ లోకి వచ్చాము అని కమలా హరీస్ ను ఉద్దేశిస్తూ రీడ్ హేస్టింగ్స్ అన్నట్లు తెలుస్తోంది..
ఈ నిర్ణయంతో ట్రంప్ మద్ధతుదారులు తట్టుకోలేకపోతున్నారు .. సోషల్ మీడియా వేదికగా నెట్ ఫ్లిక్స్ ను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు..