అనన్య నాగళ్ల బాటలో నిహారిక.. కానీ..?

NIharika Konidela
4 total views , 1 views today
మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ అనన్య నాగళ్ల బాటలో నడిచారు. ఏపీ తెలంగాణ లో వరద బాధితుల ఆర్థిక సాయం నిమిత్తం హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన సంగతి తెల్సిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు.
కానీ అనన్య నాగళ్ల మాదిరిగా ఇరు రాష్ట్రాల కోసం కాకుండా కేవలం ఏపీలోని విజయవాడ పరిధిలోని పది గ్రామ పంచాయితీల కోసం ఒక్కొక్క పంచాయితీకి యాబై వేల చొప్పున ఐదు లక్షలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు బాబాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తి. వారి బాటలో నడవడం నాకు ఆనందంగా ఉంది.
నేను పెరిగింది పుట్టింది పట్టణాల్లోనైన కానీ మా బంధువులంతా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. వారి కష్టాలు నాకు తెల్సు. ఆ అనుభవాల దృష్ట్యా గ్రామీణ వాతావరణంపై నాకు అభిమానం ఉంది. వారికి మా కుటుంబంతో సహా నేను అండగా ఉండటం సంతోషం కలిగించింది. నేను ఇందులో పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను “అని తెలిపారు.