కావాలంటే తనని గిచ్చి చూడమంటున్న నయనతార

Case registered against Nayanthara..!
2 total views , 1 views today
ఫ్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్లు హీరోయిన్లపై వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు నయనతార. పని పాట లేనివాళ్లు సృష్టించే చెత్త ఇదంతా. గతంలో నాపై కూడా పలు రుమార్లు క్రియేట్ చేశారు. ముఖంలో కాస్త మార్పు కన్పిస్తే ప్లాస్టిక్ సర్జరీలు అనేస్తారు. మేకప్ గురించి అవగాహన ఉన్నవాళ్లైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.. పత్రికల్లో వెబ్ సైట్లలో రాయరు.
నాకు కనుబొమ్మలంటే చాలా ఇష్టం. సమయం.. సందర్భాన్ని పాత్రన్ని బట్టి నా కనుబొమ్మల ఆకారం మారుస్తూ ఉంటాను. వాటికోసం ఎంతగానో కష్టపడటమే కాదు సమయాన్ని వెచ్చిస్తుంటాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కన్పిస్తే అది చూసి ప్లాస్టిక్ సర్జరీ అని రుమర్లు సృష్టిస్తారు.
నిజానికి ముఖంలో మార్పులు రావడానికి చాలా కారణాలుంటాయి. ఒక్కొక్కసారి డైటింగ్ వల్ల బుగ్గలు సైతం లోపలకెళ్తాయి. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాక బయటకు వస్తే బుగ్గలు పెరిగినట్లు కన్పిస్తాయి.. వాటికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎలా అని నయన ప్రశ్నించింది. కావాలంటే గిల్లి చూస్కోండని సలహా కూడా ఇచ్చింది.
