నారా లోకేష్ గుడ్ న్యూస్
ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు విద్యార్థులకు శుభవార్తను తెలిపారు. అందులో భాగంగా విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
‘ఈ పథకాలకు నాటి వైసీపీ ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తొలగించింది ..
ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి’ అని మంత్రి లోకేష్ వెల్లడించారు.