రాజకీయాల్లోకి ధోని.?
భారత మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ మంచి రాజకీయ నేత కాగలరని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. వస్తే మాత్రం గెలుస్తారు. ఎందుకంటే ధోనీకి పాపులారిటీ ఎక్కువ.
ఎంపీగా పోటీ చేస్తున్నావని విన్నాను.. నిజమేనా? అని ఒకసారి అడిగితే పోటీ చేయట్లేదని చెప్పారు. ఆయన ఫేమ్కి దూరంగా ఉండాలనుకుంటారు. మొబైల్ ఫోన్ కూడా వాడరు’ అని ఆయన చెప్పారు.