ఎంపీ ఫోన్ హ్యాక్
కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ అయిన సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. తన వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు.
ఇదే విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయి .. తనకు ఎవరూ కాల్ చేయొద్దని ఎక్స్ వేదికగా తెలిపారు.
తనకు కాల్స్ గానీ.. మెసేజ్‌లు గానీ పంపవద్దని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా పేర్కొన్నారు.
https://x.com/supriya_sule/status/1822535939656401008?t=O_4zOE-s3Td317ShtC525A&s=19