సినీ నిర్మాత అరెస్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతను బ్యాంకును మోసం చేసిన చీటింగ్ కేసులో అరెస్టు చేశారు పోలీసులు.. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ తో కల్సి సినీ నిర్మాత షేక్ బషీద్ ఆ బ్యాంకును నలబై కోట్ల మేర మోసం చేశాడు.
దీంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బషీద్ అల్లరే అల్లరి,మెంటల్ పోలీస్,నోటుకు పోటు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు..
ఎవడ్రా హీరో అనే చిత్రంలో బషీద్ హీరోగా నటించారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.