మాట నిలబెట్టుకున్న మోదీ

 మాట నిలబెట్టుకున్న మోదీ

గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము అని అన్నారు మంత్రి సత్యకుమార్. అణగారిన వర్గాల దశాబ్ధాల పోరాటానికి న్యాయం జరిగింది.

అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ. తన వర్గం కోసం ముప్పై ఏండ్లు పోరాడిన మంద కృష్ణకు శుభాకాంక్షలు. వర్గీకరణకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు నరేందర్ మోదీ.

వారికి నా తరపున ధన్యవాదాలు అని ట్వీట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మందకృష్ణ మాదిగను ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఓదార్చిన వీడియోను పోస్టు చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు మంత్రి సత్యకుమార్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *