సీఎం రేవంత్ కి మోడీ బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది.
తెలంగాణలో ఉన్న సింగరేణి బ్లాకులల్లో ఆరు బ్లాకులను ఈ నెల చివరాఖరి వరకు వేలం వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తామే వేస్తామని హుకుం జారీ చేసింది.
మరోవైపు గత తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క బ్లాకు కూడా వేలం వేయలేదు..కనీసం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు బ్లాకులను వేలం వేయాల్సిందే అని చెప్పడం గమనార్హం.