అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది
భారతరాజ్యాంగాన్ని రచించి… ప్రపంచానికే దిక్సూచిగా నిలబెట్టిన దివంగత భారతరత్న డా. బీ. ఆర్ అంబేద్కర్ ను ఓడించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో మాట్లాడారు..
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు . కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కరే స్వయంగా చెప్పారు..
నాటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చక అంబేద్కర్ రాజీనామా చేసినట్లు ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంబేడ్కర్ ను ఓడించిందని ఆయన కాంగ్రెస్ ను విమర్శించారు. జగ్జీవన్ రామ్ ను ప్రధాని కాకుండా ఆ పార్టీ అడ్డుకుందన్నారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు .