హీట్ పెంచుతున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు..!
జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ను పెంచుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు పదహేను మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఓ మంత్రి.. ముఖ్యమంత్రిపై తాము తీవ్ర అసంతృప్తిగా ఉన్నాము. అందుకే ఈ భేటీ అని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఆ వార్తలపై ఇటు మంత్రులు.. అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వరకూ అందరూ స్పందించారు. తాజాగా ఎమ్మెల్యేల సీక్రెట్ సమావేశంపై స్పందిస్తూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటీకల్ హీట్ ను పెంచుతున్నాయి. ఆయన మాట్లాడుతూ నా ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల సమావేశమైంది వాస్తవం.నేను ఏ ఫైల్ క్లియర్ చేయమని ఏ మంత్రిని.. ముఖ్యమంత్రిని అడగలేదు.
తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తముందో..?ఏ ఫైల్ క్లియర్ చేయమని అడిగానో రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ “ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు.రేపు దీపాదాస్ మున్షిని కలిసిన అన్ని వివరాలు వెల్లడిస్తాను.అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తాను అని తెలిపారు.