రుణమాఫీపై మంత్రి తుమ్మల క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన సంగతి తెల్సిందే..
రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “”ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని మంత్రి తుమ్మల అన్నారు.
దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తుమ్మల ఈ సందర్భంగా వెల్లడించారు