రజనీకాంత్ పై మంత్రి లోకేశ్ అసక్తికర వ్యాఖ్యలు..!

nara lokesh
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సూపర్ స్టార్ , స్టార్ హీరో రజనీకాంత్ కు ఎంతో అనుబంధం ఉన్నదనే సంగతి అందరికి తెలిసిందే. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సూపర్ స్టార్ రజనీ సినీ ప్రస్థానంలో యాబై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. తన అధికార ట్విట్టర్ లో రజనీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ” తమ కుటుంబానికి కష్టకాలంలో ఆయన అందించిన మద్ధతును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ ” రజనీకాంత్ శకంలో మనం జీవించడం చాలా అదృష్టం. ఆయన చిత్రపరిశ్రమలో యాబై ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయం ” అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆయన తమ కుటుంబంతో రజనీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ మా కుటుంబం అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు మాకు అందించిన అచంచలమైన మద్ధతును తాము ఎప్పటికి మర్చిపోలేను’ అని లోకేష్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ నటిస్తున్న కూలీ మూవీ బృందానికి విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.