మంత్రి లోకేశ్ బర్త్ డే వేడుకలు- మంత్రి శ్రీనివాస్ రికార్డ్…!
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను పండుగ మాదిరి జరిపారు టీడీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా సేవా కార్యక్రమాలను భారీగా జరిపారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తూ, పాల్గొన్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున రక్తదాన శిభిరాలను నిర్వహించారు. తన నియోజకవర్గం గజపతి నగరంలో రక్తదాన శిభిరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
విజయనగరంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఇతర టీడీపీ నేతలకు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించిన మంత్రి.. అటు అధికారిక కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. విజయనగరంలోని టిడిపి కార్యాలయం అశోక్ బంగ్లాలో టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సహా తదితరులతో కలిసి రక్తదాన శిభిరాలను ప్రారంభించారు.
విద్యార్ధులను సైతం ఆహ్వానించి.. వారిలో కొందరిని టీడీపీ నేతలు దత్తత కూడా తీసుకున్నారు. మొత్తం 27 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారి స్కూల్ ఫీజును అప్పటికప్పుడు చెల్లించారు. ఇక్కడ రక్తదాన శిభిరాలు హైలెట్ అయ్యాయి. 2 వేల మంది రక్తదానం కొరకు హాజరు కాగా… అంతమంది నుంచి రక్తం సేకరించడం సాధ్యం కాలేదు. దీనితో 800 మంది నుంచి రక్తాన్ని సేకరించారు. మొత్తం 698 యూనిట్ల రక్తాన్ని ఈ సందర్భంగా సేకరించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ 276 యూనిట్ల రక్తాన్ని సేకరించింది.
ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు 196 యూనిట్లు సేకరించగా.. రోటరీ క్లబ్ 28 యూనిట్లు, రెడ్ క్రాస్ 190 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించారు. విజయనగరం అన్నా క్యాంటిన్ కు టీడీపీ నేతలు ఒక రోజుకు సరిపడా అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు విరాళం ఇచ్చారు. మంత్రి సొంత నియోజకవర్గం గజపతి నగరంలో కూడా వేడుకలను స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఘనంగా నిర్వహించారు.