హెచ్ సీయూ వివాదంపై మంత్రి జూపల్లి వివాదస్పద వ్యాఖ్యలు..!

Jupally Krishna Rao
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వివాదం రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ఖండంతారాలను దాటిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు మేధావులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీకు చెందిన అంగుళం భూమి కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదు. గతంలో ప్రవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన నాలుగు వందల ఎకరాల భూమిని మాత్రం అభివృద్ధి కోసం. భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాల కోసం తీసుకుంటున్నాము. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి. మాయ మాటలతో విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” వాడకం లేని భూమిలో చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా..?. ఆ అడవిలో జింకలు. నెమళ్ళు ఉంటాయా అని ప్రశ్నించారు. నాలుగు వందల ఎకరాల భూమికి యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులకు యూని వర్సిటీ భూములకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రతిపక్షాల మాయలో పడోద్దంటూ విద్యార్థులకు ఆయన సూచీంచారు.
