మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తన గురించి ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు వేతనాలను ముప్పై శాతం పెంచడమే కాకుండా తమ డిమాండ్లను నెరవేర్చాలని టాలీవుడ్ నిర్మాత మండలిని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. సినీ కార్మికులు కోరుతున్న ముప్పై శాతం వేతనాల పెంపును నిర్మాతమండలి అంగీకరించాలని తాను కోరినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో మెగాస్టార్ చిరంజీవి ” నాదృష్టికి వచ్చిన విషయం ఏమిటీ అంటే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు తనను కలిశారు అని, మీడియా ముందుకెళ్లి మేము మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరిపాము. ముప్పై శాతం వేతనాలను పెంపుకు వంటి డిమాండ్లను అంగీకరించారని చెబుతున్నారు. అయితే ఈ సందర్భంలో నిజం ఏంటో నేను చెప్పదలచుకున్నాను. నేను ఫెడరేషన్ కు చెందిన ఎవర్నీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఏ వ్యక్తిగతంగా అయినా నేను సహ ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు’ అని ఆ ప్రకటనలో తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రకటనలో ఇంకా ‘ తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్ నే అగ్రసంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కరానికి రావడానికి ఫిల్మ్ ఛాంబర్ సమిస్ఠి బాధ్యత. అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్ధేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన మరియు ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి అందరూ గమనించాలని’ పేర్కొన్నారు.