‘సంక్రాంతి అల్లుడు’ గా మెగాస్టార్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. దాదాపు మూడు వందల కోట్లకు పైగా రూపాయాలను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను రప్పాడించింది.
ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతి సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ హిట్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. తాజాగా విడుదలైన సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెట్టాలి.. ఇదే టైటిల్ తో మూవీని విడుదల చేయాలి.. అనిల్ సంక్రాంతి అనే పేరును వదిలిపెట్టద్దు అని కోరుకుంటున్నానని అన్నారు..
