మెగా హీరోస్ గొప్ప మనసు

కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అంతకుముందు ఐకాన్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
