మేయర్ గద్వాల విజయలక్ష్మీకి వేధింపులు

Gadwal Vijaya Laxmi
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్ లో వేధింపులు ఎదురయ్యాయి. ఆర్ధరాత్రి మేయర్ విజయలక్ష్మీకి ఫోన్లు చేస్తూ ఓ అగంతుడు బెదిరింపులకు దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
మేయర్ విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కే.కేశవరావు అంతు చూస్తాము అంటూ మెసేజ్ లు పెట్టడమే కాకుండా ఫోన్లు చేశాడు దుండగుడు.
అయితే ఆ దుండగుడు బోరబండలో చనిపోయిన సర్ధార్ కి సంబంధించిన వ్యక్తినంటూ తెలిపినట్లు మేయర్ సిబ్బంది పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బంజారాహీల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
