రోహిత్ శర్మపై వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్..?

టీమిండియా కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత డా. షామా మహమ్మద్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు.
దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా ఆడే క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని షామాకు ఆయన హితవు పలికారు. షామాను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పైన ఆయన మండిపడ్డారు.
బాడీ షేమింగ్ పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ కాంగ్రెస్,టీఎంసీ నేతలకు హితవు పలికారు.
