పవన్ కళ్యాణ్ కి మందకృష్ణ కౌంటర్

Manda Krishna Madiga Fired On Pawan Kalyan
హోం మంత్రి అనిత గురించి డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కౌంటరిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత వర్గానికి చెందిన నేత గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుంటాము.. అనిత పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయి.
ఏదైన సమస్య ఉంటే మంత్రివర్గంలో చర్చించుకోవాలి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్షించుకోవాలి. అంతేకానీ ఇలా పబ్లిక్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు. క్యాబినెట్ అంటే ఓ కుటుంబ లాంది. కుటుంబంలోని సమస్య కుటుంబంలో చర్చించుకోవాలి .
కానీ ఓ చిన్నపిల్లాడి మాదిరిగా బజారులో మాట్లాడటం దళిత జాతికి చెందిన మహిళను అవమానించినట్లే. ఒక్క హోం శాఖలోనే తప్పులున్నాయా..?. మిగతా శాఖలో లేవా..?. వాటి గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గతఎన్నికల్లో దళితులకు ఎందుకు ఒక్క టికెట్ ఇవ్వలేదని ఆయన్ని మందకృష్ణ ప్రశ్నించారు.
