మహారాష్ట్ర లోనూ ఏపీ తరహా ఫలితాలు..?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కూటమి అయిన టీడీపీ కూటమికి 164, వైసీపీకి పదకొండు స్థానాలను ఓటర్లు కట్టబెట్టిన సంగతి తెల్సిందే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఇప్పటివరకు చేయని ప్రయత్నం లేదు.
అఖరికి కోర్టు మెట్లు కూడా వైసీపీ ఎక్కింది. ఇదే పరిస్థితి తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి.
మహారాష్ట్రలో 288 సీట్లకు గాను 29 సీట్లలో విజయం సాధిస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు. మహావికాస్ అఘాడీలోని ఏ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. శివసేన (UBT)- 20, కాంగ్రెస్-13 (3 ఆధిక్యం), ఎన్సీపీ (శరద్ పవార్)- 10 స్థానాలు మాత్రమే గెలిచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కింలలో ప్రతిపక్ష నేతలు లేరు.