‘మాతృ’ చిత్ర పాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు !!!

 ‘మాతృ’ చిత్ర పాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు !!!

Loading

మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు.

ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అపరంజి బొమ్మ.. మా అమ్మ అంటూ సాగే ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా.. నిర్మాత బి. శివ ప్రసాద్ సాహిత్యం అందించడం విశేషం. శేఖర్ చంద్ర బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఈ సందర్భంగా రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ… ” మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న మాతృ సినిమా విజయం సాధించాలి, పాటలు అన్ని బాగున్నాయి, సంగీతం, సాహిత్వం చక్కగా కుదిరాయి. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అన్నారు.మాతృ సినిమా నుండి ‘చూస్తున్నావేమో’… ఏదేదో చెయ్యమంటోంది… మల్లె పూల వాసనె… సాంగ్స్ కూడా మంచి ఆదనన లభించాయి. అన్ని డిఫరెంట్ జానర్స్ లో వేటికదే ఆకట్టుకుంటోంది. శేఖర్ చంద్ర సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *