జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి మాజీ మంత్రి..సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేసిన సంగతి మనకు తెల్సిందే.
ఇవాళ శనివారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ముందు మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ ను కలిశారు..సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ శాసనసభా పక్షం కోరింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ స్పీకర్ గారి పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి గారు అమర్యాదగా ప్రవర్తించలేదు.సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున వివరణ తీసుకోలేదు..
అఖరికి సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి గారి వివరణ కానీ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది.సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినము అని అన్నారు..
