చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు . ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో సరికొత్త మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం దర్శనమిచ్చింది.
చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్‌ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు. న్యాయదేవత మరో చేతిలా కనిపించే త్రాసును అలాగే ఉంచారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఈ కొత్త విగ్రహం కనిపించిందినట్లు సమాచారం.
‘న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది. కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తోంది. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.