కుల్దీప్ యాదవ్ 300… హార్థిక్ 200..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్,హార్థిక్ పాండ్యా చరిత్రకెక్కారు..
తాజాగా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్ లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ యాదవ్ 300, హార్థిక్ పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 176 వికెట్లు, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీశాడు..
మరోవైపు హార్థిక్ పాండ్య టీ20ల్లో 94, వన్డేల్లో 89, టెస్టుల్లో 17 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీ20ల్లో ఆల్ రౌండర్ల జాబితాలో పాండ్య నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.
