ఆర్ కృష్ణయ్య మరో షాకింగ్ డెసిషన్
తెలంగాణ లో బీసీ ఉద్యమం చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.. అందులో భాగంగా తన రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు.
దీనికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం కూడా తెలిపారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేశానని కృష్ణయ్య వెల్లడించారు.
మరోవైపు తెలంగాణకు చెందిన కృష్ణయ్యను గతంలో వైఎస్ జగన్ ఏపీ నుంచి రాజ్యసభకు పంపిన సంగతి తెల్సిందే .