ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న నిరసన

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నాయకత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. గత కొంతకాలంగా చేవెళ్ల నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో తనపట్ల, తన క్యాడర్, అభిమానుల పట్ల పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు.
ఈ విషయం గురించి చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావును కలిసి పరిస్థితిపై వివరించారు . ఆయన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలవమని సూచించారు. తీరా చంద్రశేఖర్ తివారీని కలిశాక ఆయన రాష్ట్ర బీజేపీ పార్టీ ఇన్ ఛార్జ్ అభయ్ పటేల్ ను కలవాలని సూచించారు. అభయ పటేల్ ను కలిస్తే రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావును కలవాలని సూచించారు..
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రశేఖర్ తివారీకి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపినట్లు తెలుస్తుంది. పార్టీ వ్యవహారాలపై తనను ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారని విషయాన్ని తెలిపేలా ఆయన నిరసన వ్యక్తం చేశారని బీజేపీ ఆఫీసులో టాక్.