కొండా సురేఖకు గుణపాఠం చెప్పాలి

 కొండా సురేఖకు గుణపాఠం చెప్పాలి

Ram Gopal Varma Counter To Konda Surekha

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమైన సంగతి తెల్సిందే. సినీ రాజకీయ ప్రముఖుల నుండి సామాన్యుల వరకు మంత్రి వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “మంత్రి కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను.

వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు.. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున ,చైతన్యలు చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి అని ట్వీట్ చేశారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *