కియారా అద్వానీ సంచలన నిర్ణయం..!

Kiara Advani
ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతోంది. ఆమె ఇప్పుడు గర్భవతి. ఆమె, భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తల్లితండ్రులు కాబోతు న్నారు.
కియారా అద్వానీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు, దాదాపు షూటింగ్ పూర్తి అయిన సిని మాలు మినహాయిస్తే మిగతా సినిమాల నుంచి తప్పుకుంది. త్వరలోనే మొదలు కావాల్సిన డాన్ 3 సినిమాని వదులుకుంది.
ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోనున్నారు. కియారా అద్వానీ మరో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంటుం దట. బాబు లేదా పాప పుట్టిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకుంటుందట. ఆ తర్వాత రీఎంట్రీ ఉంటుంది అని ఆమె టీం చెబుతోంది.
