సింగరేణి ప్రైవేటీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారు అని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ” సింగరేణిని ప్రైవేటీకరిస్తారా..?.. లేదా ప్రభుత్వ నేతృత్వంలో నడిపిస్తారా..? అని ” కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ” సింగరేణిని అసలు ప్రైవేటీకరణ చేయబోము. ఒకవేళ చేయాలనుకుంటే యాబై ఒక్కటి శాతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని” ఆయన తేల్చి చెప్పారు.
దేశంలో ఇంకా ఏ బొగ్గు గనినీ ప్రైవేటుఫరం చేసే ఆలోచనలేదు.. సింగరేణి అభివృద్ధికి.. కార్మికులకు సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.