మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన..!

RMPs and PMPs should not use the word “doctor”.
మంగళగిరి మార్చి 7 (సింగిడి)
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్రంలోని మహిళలు ఎదురు చూస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితమని మండలిలో బదులిచ్చారు..
ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ, కర్ణాటకలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.