KCR తొలి విజయం

 KCR తొలి విజయం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన విద్యుత్ కొనుగోలుపై జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు..

సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని  చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు..అంతేకాకుండా తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు..

దీంతోజస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై గులాబీదళపతి KCR ఒకింత విజయం సాధించారనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీన్ని రద్దు చేయాలన్న ఆయన పిటిషన్ విచారణలో నరసింహపై సుప్రీంకోర్టు నేడు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఒకవైపు విచారిస్తూనే జూన్ 11న ఎలా మీడియాతో మాట్లాడుతారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. నాడు కేసీఆర్ సైతం దీన్నే తప్పుబట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సుప్రీం దీన్ని అంగీకరించడం గులాబీ బాస్  చతురతకు నిదర్శనమంటున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *