సీజేఐ గా జస్టీస్ సంజీవ్ ఖన్నా
అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తాజా సీజేఐ గా జస్టీస్ సంజీవ్ ఖన్నా నియమితులైనారు. నవంబర్ పదో తారీఖుతో ప్రస్తుత సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ డీవై పదవికాలం పూర్తవుతుంది. దీంతో ఖన్నా నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
అసలు ఎవరీ సంజీవ్ ఖన్నా..?. ఇప్పుడు తెలుసుకుందాము. ఖన్నా మే14,1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు.
2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి యాబై ఒకటో ప్రధాన న్యాయమూర్తిగా 183రోజులు తన బాధ్యతలను నిర్వర్తించనున్నారు.