మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ కి చెందిన నేత..మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మరికొందరితో కలిసి రాజీవ్ తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుండే జోగి రమేష్ కు చెందిన పలు ఇండ్లపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సంగతి తెల్సిందే..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది ఆయన ఇంట్లో ఉన్న పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు.