జియో ఆఫర్…!
ప్రముఖ టెలికామ్ నెట్ వర్క్ సంస్థ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా జియో భారత్ 4G మొబైల్ ధరను రూ.999ల నుండి రూ.699లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ దీపావళి పండుగ నుండి మాత్రమే అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ తెలిపింది.ఇక ఈ ఫోన్ లో వాడే నెలసరి రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల కంటే రూ.76లు తక్కువ ఉంటుంది.
అంటే ధర రూ.123 మాత్రమే అని ప్రకటించింది. ఈ రకంగా వినియోగదారులు తొమ్మిది నెలల్లోనే ఫోన్ కోసం చెల్లించిన ధరలను తిరిగి పొందవచ్చు. ఇక ఈ ఫోన్ లో అన్ని డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి.