జనసేనాని లెక్క తప్పిందిగా..?
ఏదైన పని చేసే ముందు… ఓ మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి పని చేయాలి.. ఆలోచించి ఓ మాట మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తుంది. సత్యం సుందరం మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో యాంకర్ హీరో కార్తీని లడ్డూ కావాల్నా నాయన అని అడుగుతుంది. దానికి కార్తీ సమాధానంగా లడ్డూ లాంటీ సెన్సిటీవ్ అంశాల గురించి మాట్లాడే సమయం ఇది కాదు . ఆ టాఫిక్ వద్దు అని చాలా సున్నితంగా .. విమర్శకులు సైతం మెచ్చుకునేలా .. హిందువులకు మరి ఆర్ధమయ్యేలా జవాబు ఇచ్చాడు.
ఈ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ హీరో కార్తీ ఏదో తప్పుగా మాట్లాడినట్లు.. ఏదో పెద్ద అపచారం జరిగినట్లు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు హిందువుల మనోభావాలను గౌరవించాలి.. తిరుపతి లడ్డూ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయద్దు అని ఏకంగా కార్తీని హెచ్చరిస్తూ మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో కార్తీ క్షమాపణలు చెబుతూ నేను హిందుత్వాన్ని.. హిందువుల మనోభావాలను గౌరవిస్తాను.. నాకు దేవుడి పట్ల నమ్మకం ఉంది.. మీ మనొభావాలు దెబ్బతింటే క్షమించండి అని రెండు లైన్లో చెప్పేశాడు. అయితే పవన్ ఏదో తప్పు చేసినవాడి లెక్క ముప్పై లైన్లలో కార్తీకి రిప్లయ్ ఇచ్చాడు.
ఒకపక్క విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో.. అధికారంలో ఉండి మత చిచ్చు రేపుతున్నాడని విరుచుకుపడుతూనే హీరో కార్తీ అన్నమాటల్లో తప్పు ఏముంది అని ట్విట్టర్లో తన ప్రతాపం చూపుతున్నాడు.. మరికొన్ని తమ కూటమి పార్టీలో ఒకటైన టీడీపీ హ్యాండిల్స్.. నెటిజన్లు, రాజకీయ విమర్శకులు పవన్ తీరును తప్పు పడుతున్నారు. కార్తీ తప్పు ఏమి లేదు.. తానే హిందు మత పరిరక్షకుడిగా అవతరించాలనే లక్ష్యంతో కార్తీని అనవసరంగా మాటలు అన్నాడు..
ఇదే పవన్ గతంలో దేవుడి ముందు పూజకోసం వెలిగించిన అగరబత్తులతో సిగరేట్ వెలిగించుకున్నట్లు.. తాను బాప్తీస్మన్ తీసుకున్నట్లు చెప్పిన మాటలను.. తాను చర్చిలో ఉన్న కొన్ని ఫోటోలను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. మరి పవన్ దీనిపై ఏమి సమాధానం చెప్తారంటూ వారు విమర్శిస్తున్నారు. అందుకే ఏదైన మాట్లాడే ముందు జనసేనాని ఆలోచించాలి మాట్లాడాలి.. లేకపోతే ఇలానే మిస్ ఫైర్ అవుతుందని వారు సూచిస్తున్నారు. మరి జనసేనాని ఇకముందైన ఇలా మిస్ ఫైర్ కాకుండా చూస్కుంటారేమో చూడాలి..!